ఆ హీరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను చంపాలని అనుకున్నాడట..!
Dileep booked for ‘plan to kill investigating officer’ in sexual assault case. మలయాళ నటుడు దిలీప్‌పై లైంగిక వేధింపులు, అపహరణ
By Medi Samrat
మలయాళ నటుడు దిలీప్‌పై లైంగిక వేధింపులు, అపహరణ కేసులపై విచారణ జరిపిన దర్యాప్తు అధికారిని చంపడానికి కుట్ర పన్నాడని ఆరోపణలు రావడంతో కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విభాగం ఆదివారం అతడిపై కొత్త కేసు నమోదు చేసింది. 2017 లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ ఒకరు, ఆ కేసు విచారణ కొచ్చిలోని ప్రత్యేక కోర్టులో చివరి దశలో ఉంది. లైంగిక వేధింపులు, అపహరణ కేసులపై విచారణ జరిపిన దర్యాప్తు అధికారిని ఇతరులను హత్య చేసేందుకు దిలీప్ ప్లాన్ చేసినట్లు ప్రముఖ మాజీ దర్శకుడు బాలచంద్రకుమార్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తాజాగా కేసును నమోదు చేశారు.
రెండు వారాల క్రితం, బాలచంద్రకుమార్ ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల విజువల్స్‌ను దిలీప్ వీక్షించాడని మరియు చిత్ర పరిశ్రమలో డ్రైవర్‌గా పనిచేసిన ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీతో అనుబంధం కొనసాగించాడని ఆరోపించారు.
దిలీప్‌కు ఆపాదించబడిన ఆడియో క్లిప్‌లు కూడా మీడియాలో వచ్చాయి.. అందులో "ఐదుగురు దర్యాప్తు అధికారులు ఎలా బాధపడతారో వేచి ఉండండి" అని చెప్పడం వినిపించింది. ఆడియో క్లిప్‌లో ఉన్న మరో వ్యక్తి "బైజు పౌలోస్ ( కేసును విచారించిన అధికారి)ని ట్రక్కు ఢీకొంటే మరో రూ. 1.50 కోట్లు చూడవలసి ఉంటుంది" అని చెప్పడం వినిపించింది. దర్యాప్తు అధికారి, అతని బృందంలోని సభ్యులపై కుట్ర పన్నేందుకు దిలీప్ ప్రయత్నించాడని బాలచంద్రకుమార్ పోలీసుల చెప్పారు. దిలీప్‌పై బాలచంద్రకుమార్ వెల్లడించిన వివరాల ఆధారంగా జనవరి 20న నివేదిక సమర్పించాలని కొచ్చిలోని ట్రయల్ కోర్టు గత వారం పోలీసులను ఆదేశించింది. బాలచంద్రకుమార్ వెల్లడించిన నేపథ్యంలో కొంతమంది సాక్షులకు మళ్లీ విచారణకు సమన్లు జారీ చేసేందుకు అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ హైకోర్టును ఆశ్రయించింది.