సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల విషయంలో దిల్ రాజుకు షాక్

Dil Raju gets a shock when it comes to Sankranti films. సంక్రాంతికి థియేటర్లలో తెలుగు చిత్రాల రిలీజ్ కే ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే..

By M.S.R  Published on  13 Nov 2022 12:14 PM GMT
సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల విషయంలో దిల్ రాజుకు షాక్

సంక్రాంతికి థియేటర్లలో తెలుగు చిత్రాల రిలీజ్ కే ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారిసు, తునివు తెలుగు రాష్ట్రాల్లో 2023 సంక్రాంతి కి విడుదల కాబోతున్నాయి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి మొదటి ప్రాధాన్యత స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాలకు ఇచ్చారు. ఒకవేళ థియేటర్లు మిగిలితే ఆ థియేటర్లలో డబ్బింగ్‌ సినిమాలను విడుదల చేసుకోవచ్చని నోట్‌ లో పేర్కొంది. తెలుగు సినిమాల నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని, నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని 08-12-2017 మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ నోట్‌లో తెలిపింది. ఈ నాలుగు సినిమాల్లో నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న తమిళ చిత్రం వారిసు ఉంది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అవుతుంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశాలున్నాయి.


Next Story