శ్రీతేజకు అన్ని విధాలా అండగా ఉంటాం : దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిస‌లాట‌ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన మధ్య, నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 6:18 PM IST

శ్రీతేజకు అన్ని విధాలా అండగా ఉంటాం : దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిస‌లాట‌ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన మధ్య, నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. శ్రీ తేజకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించేందుకు చిత్ర పరిశ్రమ కలిసి ముందుకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఇప్పటికే రూ. 2 కోట్లను డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీ తేజ తండ్రికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆస్పత్రిలో జరిగిన చికిత్స కోసం రూ. 70 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా.. రిహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చులను అల్లు అర్జున్ స్వయంగా భరిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. శ్రీ తేజ తండ్రి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ టీం మొదటి రోజు నుంచి చాలా బాగా స్పందించిందని, ఇప్పటి వరకూ అన్ని విధాల సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొంత ఆర్థిక సహాయం అవసరమున్న నేపథ్యంలో దిల్ రాజుతో మాట్లాడగా.. ఆయన కూడా అన్ని విధాల సహాయం చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Next Story