ఢీ-13 ఫైనల్స్ విన్నర్ ఎవరో లీకైపోయింది..!
Dhee 13 Final Winner. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఢీ 13' డాన్స్ షో ఫైనల్స్ కు వస్తున్నాడంటే భారీ అంచనాలు
By Medi Samrat Published on 26 Nov 2021 4:38 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఢీ 13' డాన్స్ షో ఫైనల్స్ కు వస్తున్నాడంటే భారీ అంచనాలు ఉంటాయి. 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సినిమా సీజన్ చివరి దశకు చేరుకున్న ఢీ 13 షో ఫైనల్స్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. పుష్ప ది రైజ్ చిత్రంలో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా..' అనే సాంగ్‌కు డానర్స్ స్టెప్స్ వేస్తుండగా బన్నీ ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఆయన కూడా స్టెప్పులేశాడు. త్వరలోనే ఢీ 13 ఫైనల్ ఎపిసోడ్స్ ప్రసారం కానుంది. ఢీ 13లో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మధ్య పోటీలో ఎవరు విజేతలో తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వీడియో లీక్ అవ్వడం ఇప్పుడు షాకింగ్ గా ఉంది.
Dhee 13 Final Winner 🏆 pic.twitter.com/CZ6wad60zP
— PawanKalyan (@Legend_PSPK) November 26, 2021
ఈ షో విజేత ఎవరనే సస్పెన్స్ ఈ వైరల్ వీడియో వలన వీడిపోతోంది. షోకు సంబంధించిన కీలక ఘట్టం విన్నర్ ఎవరా అన్నది. విజేతను ప్రకటించే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విషయాన్ని వీడియో ద్వారా తెలిపారు. ఇద్దరు ఫైనలిస్ట్ ల చేయిని అల్లు అర్జున్ పట్టుకుని ఉండగా.. కౌంట్ డౌన్ మొదలైంది. అప్పటి వరకూ ఉన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఓ అమ్మాయి చేయిని అల్లు అర్జున్ పైకి లేపాడు. అంతే విన్నర్ ఎవరో తెలిసిపోవడంతో ఆమె బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకూ ఆ విన్నర్ ఎవరంటే.. 'కావ్య' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. పూర్తీ వివరాలు తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే దాకా ఆగాల్సిందే..!