150 కోట్ల కలెక్షన్స్ సాధించిన రాయన్

ధనుష్ నటించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్లు వసూలు చేసి మొదటి వారాంతంలో రికార్డు కలెక్షన్స్ ను సాధించింది

By Medi Samrat  Published on  12 Aug 2024 3:51 PM GMT
150 కోట్ల కలెక్షన్స్ సాధించిన రాయన్

ధనుష్ నటించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్లు వసూలు చేసి మొదటి వారాంతంలో రికార్డు కలెక్షన్స్ ను సాధించింది. ఈ చిత్రం రెండవ, మూడవ వారాంతంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. రాయన్ తమిళనాడులో దాదాపు 75 కోట్లు, తెలుగు రాష్ట్రాలు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో రాయన్ 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కోలీవుడ్ నుండి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి టైర్ 2 చిత్రం కూడా ఇదే. రాయన్ సినిమా మొదటి రోజు టాక్ విన్నాక ఇంత బాగా ప్రదర్శన చేస్తుందని ఎవరూ ఊహించలేదు. యాక్షన్ సన్నివేశాలు, A.R. రెహమాన్ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ చేశారు. ద‌నుష్‌ ద‌ర్శ‌కుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. ధనుష్ తన కొత్త చిత్రం కుబేరలో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.

Next Story