శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'కుబేర' చిత్రంతో తెలుగు/తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ధనుష్, కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ధనుష్ ఆదిపురుష్ డైరెక్టర్‌తో 'కలాం' బయోపిక్ కోసం జతకట్టాడు.
ఆదిపురుష్ తర్వాత చాలా విమర్శలను ఎదుర్కొన్న దర్శకుడు ఓం రౌత్. ధనుష్ తో తన కొత్త చిత్రం 'కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' ను ఓం రౌత్ ప్రకటించాడు. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త APJ అబ్దుల్ కలాం జీవిత కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఓం రౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో కలాం అధికారిక పోస్టర్‌ను పంచుకున్నారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్‌కు, ఒక లెజెండ్ ప్రయాణం సాగింది. భారతదేశ మిస్సైల్ మ్యాన్ వెండితెర మీదకు రాబోతున్నాడని చెప్పారు ఓం రౌత్.