దేవర మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రల్లో హౌస్ ఫుల్స్ తో దేవర పార్ట్ 1 సినిమా కలెక్షన్ల రికార్థులను కొల్లగొడుతూ ఉంది.

By Medi Samrat  Published on  28 Sept 2024 11:57 AM IST
దేవర మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రల్లో హౌస్ ఫుల్స్ తో దేవర పార్ట్ 1 సినిమా కలెక్షన్ల రికార్థులను కొల్లగొడుతూ ఉంది. మొదటి షో నుండే సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంది. దేవర పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. Sacnilk.com ప్రకారం, ఈ చిత్రం శుక్రవారం ₹70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించారు.

Sacnilk.com ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ₹77 కోట్లు వసూలు చేసింది. తెలుగు: ₹68.6 కోట్లు; హిందీ: ₹7 కోట్లు; కన్నడ: ₹30 లక్షలు; తమిళం: ₹80 లక్షలు; మలయాళం: ₹30 లక్షలు వచ్చాయి. దేవర పార్ట్ 1 శుక్రవారం నాడు తెలుగులో 79.56% ఆక్యుపెన్సీని కలిగి ఉందని చెబుతున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేక, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవర, వరదగా నటించాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.

Next Story