ఆత్మ‌హ‌త్య చేసుకున్న జాదవ్‌పూర్ యూనివర్శిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్

Deputy of Kolkata’s Jadavpur University vice-chancellor found hanging at home. జాదవ్‌పూర్ యూనివర్శిటీ ఉపకులపతి బుధవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం

By Medi Samrat
Published on : 20 July 2022 9:17 PM IST

ఆత్మ‌హ‌త్య చేసుకున్న జాదవ్‌పూర్ యూనివర్శిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్

జాదవ్‌పూర్ యూనివర్శిటీ ఉపకులపతి బుధవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సి బోస్ రోడ్‌లోని ఇంట్లో 57 ఏళ్ల సమంతక్ దాస్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కరాటేలో ఉపయోగించే కాటన్ బెల్ట్‌తో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని ఎంఆర్ బంగూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ కలహాల కారణంగా మానసికంగా కుంగిపోయినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

బుధవారం మధ్యాహ్నం సమంతక్ దాస్ కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను పదేపదే పిలిచారు, కాని ఆయ‌న‌ తన గది తలుపు తెరవలేదు, గ‌ది లోపల నుండి లాక్‌ చేయబడింది అని పోలీసులు తెలిపారు. "స్పందన రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు" అని ఒక అధికారి తెలిపారు. "పోలీసులు ఆయ‌న‌ గది తలుపులు పగలగొట్టి ఉరి వేసుకున్నట్లు కనుగొన్నారు," అని అతను చెప్పాడు. ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు శవపరీక్ష నిర్వహించనున్నారు.









Next Story