నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను రక్షించుకోవడంలో భాగంగా పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో ఈకామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా కోర్టులను ఆశ్రయించారు. సదరు వ్యక్తుల అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం చేయకూడదని సంబంధిత కోర్టుల నుండి ఆదేశాలు వచ్చాయి.