ఆ హీరోయిన్ అలా చేసిందేంటి
Deepika Padukone shows the finger. పఠాన్ సెట్స్ నుండి షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె ఫోటోలు లీక్ అయ్యాయి.
By Medi Samrat Published on 22 March 2022 6:36 PM ISTపఠాన్ సెట్స్ నుండి షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె ఫోటోలు లీక్ అయ్యాయి. ఆమె పసుపు రంగు బికినీ ధరించి కనిపించగా, షారూఖ్ ఖాన్ తన ఎయిట్-ప్యాక్ యాబ్స్ తో కనిపించాడు. కొత్తగా లీకైన ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ బాల్కనీలో ఉండడాన్ని మనం చూడవచ్చు.
దీపికా పదుకొణె, షారుక్ ఖాన్ ప్రాజెక్ట్ 'పఠాన్' షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. సినిమా సెట్‌లో, దీపిక తన మధ్య వేలును చూపుతుండగా, SRK ప్రక్కన ఉన్నాడు. సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె అలా చేసిందా..? లేక ఎవరైనా అనుమతి లేకుండా ఫోటోలు తీస్తున్నందుకు అలా చూపించిందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. షూట్ కోసం, దీపిక తెల్లటి టాప్, స్లిట్ స్కర్ట్ ధరించింది, తరువాత ఆమె నలుపు జంపర్ జాకెట్ ధరించి కనిపించింది. ఇతర చిత్రాలలో షారుఖ్ స్పెయిన్ వీధుల్లో సిగరెట్ తాగుతూ కనిపించాడు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ సినిమాలో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటిస్తున్నారు. షారుఖ్ మార్చి 2న పఠాన్ టీజర్‌ను పంచుకున్నారు. అది కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. 25 జనవరి, 2023న సినిమా హాళ్లలో విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగు భాషలలో ఈ చిత్రం విడుదలవుతోంది.