అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర

Death threats to actress Anushka Shetty’s brother. దక్షిణాది నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ

By Medi Samrat
Published on : 13 Jun 2022 4:30 PM IST

అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర

దక్షిణాది నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భద్రత కల్పించాలని కోరుతూ కర్ణాటక హోంమంత్రికి పిటిషన్‌ దాఖలు చేశారు. మిత్రులుగా మారిన శత్రువులైన మన్విత్ రాయ్, రాకేష్ మల్లి గుణరంజన్ శెట్టికి హత్య బెదిరింపులు జారీ చేశారని గుణరంజన్ పార్టీ సభ్యులు ఆరోపించారు. అయితే, మన్విత్ రాయ్ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశాడు. తాను విదేశాలలో ఉన్నానని, ఎవరికీ బెదిరింపులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. పోలీసులు ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో రాకేష్ మల్లిని కూడా ప్రశ్నించారు.

మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ బతికున్నప్పుడు మన్విత్ రాయ్, గుణరంజన్ శెట్టిలు కుడి, ఎడమ భుజంగా ఉండేవారు.ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ రాయ్ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు మన్విత్ రాయ్ కుట్ర పన్నినట్టు సమాచారం. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని అంటున్నారు.

కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్ తనకు భద్రత కల్పించాలని కోరారు. గుణరంజన్ శెట్టికి హత్య బెదిరింపులు రావడంతో భద్రత కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. తమకు రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుణరంజన్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయకర్ణాటక జనపర వేదిక సభ్యులు ఆదివారం హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు వినతిపత్రం సమర్పించారు.









Next Story