బ్యాడ్ న్యూస్.. 19 ఏళ్లకే కన్నుమూసిన నటి
సినీ పరిశ్రమ నుంచి మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఎవరూ ఊహించని వార్త బయటకు వచ్చింది.
By Medi Samrat Published on 17 Feb 2024 7:50 PM ISTసినీ పరిశ్రమ నుంచి మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఎవరూ ఊహించని వార్త బయటకు వచ్చింది. అమీర్ ఖాన్ చిత్రం 'దంగల్'లో జూనియర్ బబితా ఫోగట్ పాత్ర పోషించిన నటి సుహానీ భట్నాగర్ కన్నుమూసింది. ఆమె మరణవార్త అందరినీ శోకసంద్రంలో ముంచివేసింది.
సుహానీ భట్నాగర్ వయస్సు 19 సంవత్సరాలు. నివేదికల ప్రకారం.. ఆమె కాలు విరిగింది. అందుకు ఆమె తీసుకుంటున్న మందులకు రియాక్షన్ రావడంతో శరీరం వాపు రావడం మొదలైంది. అలా ఆమె మృత్యువాత పడ్డారు. సుహాని మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సుహాని మృతి పట్ల 'దంగల్' దర్శకుడు నితీష్ తివారీ, నటుడు అమీర్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు.
'దంగల్' చిత్రంలో బబితా ఫోగట్ తండ్రిగా నటించిన అమీర్ ఖాన్ సుహాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మా సుహాని మరణం గురించి విని చాలా బాధపడ్డాం. ఆమెతల్లి పూజాజీకి మరియు కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక సానుభూతి. ఇంత ప్రతిభావంతురాలైన యువతి, ఇంతటి టీమ్ ప్లేయర్, సుహాని లేకుంటే దంగల్ అసంపూర్తిగా ఉండేది. సుహానీ, నువ్వు మా హృదయాల్లో ఎప్పటికీ స్టార్‌గా మిగిలిపోతావు. మీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ సంతాప సందేశాన్ని షేర్ చేశారు.
దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ కూడా సుహాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “సుహాని మరణం దిగ్భ్రాంతికరమైనది.. హృదయ విదారకమైనది.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని విచారం వ్యక్తం చేశారు.