వివాదంలో జానీ మాస్టర్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో ఇరుక్కున్నారు. తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని.. షూటింగ్‌లకు పిలవకుండా అడ్డుకుంటున్నాడ‌ని ఓ డ్యాన్స‌ర్‌ ఆరోపించాడు.

By అంజి  Published on  6 Jun 2024 11:23 AM IST
choreographer, Johnny Master, Tollywood, Hyderabad

వివాదంలో జానీ మాస్టర్ 

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో ఇరుక్కున్నారు. తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని.. షూటింగ్‌లకు పిలవకుండా అడ్డుకుంటున్నాడ‌ని ఓ డ్యాన్స‌ర్‌ ఆరోపించాడు. త‌న‌ను షూటింగ్‌లకు పిలవ‌వద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్ చేయిస్తున్నాడని డ్యాన్సర్ సతీష్‌ వాపోయాడు. గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనకు షూటింగ్ చెప్పిన మాస్టర్స్‌ను, కోఆర్డినేటర్‌లను బెదిరిస్తూ వారిపై ఫైన్‌లు వేయిస్తున్నాడన్నాడు.

జనరల్ బాడీ మీటింగ్‌లో సమస్యల‌పై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని సతీష్ ఆరోపిస్తున్నాడు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. డ్యాన్సర్ సతీష్.. తనను జానీ మాస్టర్ ఉపాధి దక్కకుండా వేధిస్తూ ఉన్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతంపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది.

Next Story