నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ ట్రైలర్ వివరాలు అధికారికంగా వెలువడ్డాయి. ఇటీవలే లక్కీ భాస్కర్ తో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న నిర్మాత నాగ వంశీ, నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్‌తో ఈ సంక్రాంతికి రాబోతున్నాడు.
చిత్ర నిర్మాత, దర్శకుడు విలేకరులతో సమావేశమై సినిమా ప్రచార కార్యక్రమాల గురించి తెలియజేశారు. డాకు మహారాజ్ ట్రైలర్ వివరాలను అధికారికంగా వెల్లడించారు. తొలుత జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం జనవరి 4వ తేదీ సాయంత్రం అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ పాటను కూడా విడుదల చేయనున్నారు.
డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన మరొక ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుందని, విజయవాడ లేదా మంగళగిరిలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రచిస్తున్నట్లు నాగ వంశీ చెప్పారు. డాకు మహారాజ్ జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.