నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' సినిమా OTT లోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. ఈ చిత్రం రెండు వారాల క్రితమే OTTలో ప్రసారం కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడు OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ డాకు మహారాజ్ స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్‌కు వెళ్లనప్పటికీ, ఇది మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రశంసలు అందుకున్నాయి. ప్రగ్యా జైస్వాల్, బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, షైన్ టామ్ చాకో, ఊర్వశి రౌతేలా డాకు మహారాజ్‌లో కీలక పాత్రలు పోషించారు.