ఐబొమ్మ రవిపై నమోదైన కేసులివే!!
ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.
By - Knakam Karthik |
ఐబొమ్మ రవిపై నమోదైన కేసులివే!!
ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు, మిగతా నాలుగు కేసుల్లోనూ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తాజాగా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవిని మొదట అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో అతడిని ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పలువురు సినీ నిర్మాతలు రవిపై ఫిర్యాదు చేయడంతో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషనల్ వ్యవహారంలోనూ రవిపై కేసు నమోదైంది.
డీసీపీ, సీసీఎస్, ఇతర సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో ప్రత్యేక బృందం రవిని విచారించింది. అతని నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచిన 21,000 కంటే ఎక్కువ భారతీయ భాషా సినిమాల గురించి ప్రశ్నించినట్లు అధికారి తెలిపారు. కోర్టు సూచనల మేరకు రవి స్టేట్‌మెంట్‌ను అతని న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డ్ చేశారు.