నటుడు సీవీఎల్ నరసింహారావు ఐబొమ్మ రవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినిమాల్లో హీరోల మాదిరిగానే ఒకరు పుట్టుకువస్తారు. అలా పుట్టుకువచ్చిన వాడే ఐబొమ్మ రవి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో సినిమా కార్మికులు చాలా నష్టపోయారు. వారి గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలకు నష్టం వస్తే మాత్రం మొత్తం వ్యవస్థనే కదిలిందని అన్నారు. ఐబొమ్మ రవి విషయంలో తప్పు నిర్మాతలదే అని.. వారిపై వారే భస్మాసుర హస్తం ప్రయోగించుకున్నారన్నారు. ఐబొమ్మ రవిపై నిర్మాతలు తప్ప ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. రవి రాబిన్ హుడ్ కాదని స్పష్టం చేశారు.