సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన నటి రష్మిక మంథాన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. వీడియో సృష్టికర్తగా అనుమానిస్తున్న నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చామని.. అతన్ని విచారిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
నవంబర్ 10న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆద్వర్యంలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 465 (ఫోర్జరీకి శిక్ష), 469 (పరువుకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C, 66E కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన నిందితులను గుర్తించేందుకు యూఆర్‌ఎల్, ఇతర వివరాలను పొందేందుకు ఐఎఫ్‌ఎస్‌ఓ మెటాకు లేఖ రాసింది. అనంతరం ఈ కేసులో ఈ అరెస్టు జరిగింది.