మాస్ మహారాజా 'ఖిలాడీ' సినిమా మీద వచ్చిన రూమర్ నిజం కాదట

Crazy Rumors On Ravi Teja Khiladi Movie. కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు. ' ఖిలాడి ' సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని చిత్ర యూనిట్ తెలిపింది.

By Medi Samrat  Published on  16 May 2021 1:06 PM GMT
Khiladi Movie

మాస్ మహారాజా రవితేజ నటించిన 'క్రాక్' సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురు చూసిన రవితేజకు.. ఆయన అభిమానులకు క్రాక్ మంచి కిక్ ఇచ్చింది. రవితేజ మరింత స్పీడుగా సినిమాలను చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో నటిస్తూ ఉన్నాడు రవితేజ. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని కూడా అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణాల వలన రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని.. భారీ ధరకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్ ను ఇచ్చిందనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్ లో నిజం లేదని చిత్ర బృందం తేల్చేసింది.

ఖిలాడి సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 28 న విడుదల చేయాలని భావించగా.. కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు. ' ఖిలాడి ' సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు. ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి.


Next Story
Share it