అక్కడ కూడా అన్ని రికార్డులను బద్దలు కొట్టిన యానిమల్

రణబీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది.

By Medi Samrat  Published on  7 Feb 2024 2:21 PM IST
అక్కడ కూడా అన్ని రికార్డులను బద్దలు కొట్టిన యానిమల్

రణబీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇక్కడ కూడా వ్యూవర్ షిప్ విషయంలో అగ్రస్థానంలో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ రెండు వారాల్లో రికార్డ్ వ్యూయర్‌షిప్‌తో ఆల్ టైమ్ రికార్డ్ హోల్డర్‌గా నిలిచింది. జనవరి 26 నుండి మొదటి వారం పూర్తయ్యే వరకూ.. OTTలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా యానిమల్ నిలిచింది. రెండో వారంలో కూడా 10 రోజుల పాటు అదే రికార్డును కొనసాగించింది. ఈ కాలంలో, యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో 39.3 మిలియన్ గంటల వ్యూవింగ్ అవర్స్ ను నమోదు చేసింది.

ఇటీవలి నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన సాలార్‌ను కూడా యానిమల్ అధిగమించింది. హిందీ వెర్షన్‌లో సాలార్ విడుదల కాకపోవడం కూడా యానిమల్ రికార్డు క్రియేట్ చేయడానికి ఒక కారణం. RRR 10 రోజుల్లో 25.5 మిలియన్లు.. జవాన్ 11 రోజులలో 25.5 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ ను పొందింది. ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను యానిమల్ తాజాగా బద్దలు కొట్టింది. యాక్షన్ ఎంటర్‌టైనర్ 2వ వారంలో కూడా నెం.1 ట్రెండింగ్‌లో ఉంది. భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది.

Next Story