బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను బయటపెడతానని ఆర్ధిక మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు. ఎవరినైతే జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నానో.. వారే ఇప్పుడు ఎదురుతిరిగారు.. వెన్నుపోటు పొడిచారని సుకేష్ ఆరోపించాడు. బాధితులుగా పేర్కొంటూ నిందలు వేస్తున్నారని.. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదన్నారు. తనకు వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదన్నాడు సుకేష్. ఇన్నాళ్లూ రహస్యంగా దాచి ఉంచిన ఆధారాలన్నీ బయటపెడతా.. సంభాషణలు, స్క్రీన్‌షాట్లు, రికార్డింగులు, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు.. అన్నింటి గురించి చెబుతా.. ఆ వ్యక్తికి సామాజిక మాధ్యమంలో ప్రచారం కల్పించేందుకు మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టానని కూడా జాక్వెలిన్ పేరు ప్రస్తావించకుండా సుకేష్ వ్యాఖ్యలు చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు గురించి ప్రస్తావించకుండా సుకేష్ చంద్రశేఖర్ ఈ లెటర్ ను తన లాయర్ ద్వారా బయటపెట్టాడు.
తన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. లెటర్స్ లాంటివి విడుదల చేయకుండా తక్షణమే సుకేష్ చంద్రశేఖర్ ను నిరోధించేలా ఆదేశాలను కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టును జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆశ్రయించారు. సుకేష్ తో తనకెలాంటి సంబంధం లేదని.. అతను తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పిటిషన్ దాఖలు చేశారు.