అల్లు అర్జున్ అలా అనడం విడ్డూరంగా ఉంది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్
అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 22 Dec 2024 2:15 PM ISTఅల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. పుష్ప 2 సినిమా కోసం సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ నిన్న హడావుడిగా పెట్టిన ఒక ప్రెస్ మీట్ లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నాము.. ప్రెస్ మీట్ బట్టి రియల్ హీరోగా కాకుండా రిల్ హీరోగా ప్రవర్తించిన తీరు కనబడుతుందన్నారు. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగవద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.. ఆరోజు సంధ్య థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది.. అంతా గందరగోళంగా ఉంది.. ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు.. మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప, ప్రజలు ఏమైతుండ్రు బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని మండిపడ్డారు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు.. స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉందన్నారు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు.. ప్రజలకు ఏం సంజాయిషీ ఇచ్చారో మీకే క్లారిటీ లేనట్లుగా ఉంది.. ఒక బాధ్యత యుతంగా ఉండాలి కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దు అన్నారు. నా క్యారెక్టర్ ను దెబ్బతీశారు అని అల్లు అర్జున్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమాలోనే హీరోగా కాదు.. బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని అన్నారు.