ప్రముఖ హాస్యనటుడు, లొల్లు సభ స్టార్ శేషు కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన మరణ వార్త విని చిత్ర పరిశ్రమ షాక్ లో ఉంది. ఆయన అభిమానులు, సహచరులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో పోరాడిన శేషు ఈరోజు, మార్చి 26న మరణించారు. శేషు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
శేషు హిట్ టెలివిజన్ షో "లొల్లు సభ" ద్వారా పాపులారిటీని సంపాదించారు. అనేక చిత్రాలలో చిరస్మరణీయ పాత్రలలో నటించారు. వేలాయుధం, A1, పారిస్ జయరాజ్, డిక్కీలూనా లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. చివరగా,సంతానం హీరోగా వచ్చిన వడకుపట్టి రామస్వామి సినిమాలో నటించారు. ఇక శేషు భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.