మళ్లీ మొదలైన రచ్చ.. జానీ మాస్టర్ కు అసలు తెలియదట

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి.

By Kalasani Durgapraveen  Published on  9 Dec 2024 1:18 PM GMT
మళ్లీ మొదలైన రచ్చ.. జానీ మాస్టర్ కు అసలు తెలియదట

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయని, ఈ సంఘానికి నూతన అధ్యక్షుడు వచ్చారని కూడా ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. యూనియన్ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. తనను యూనియన్ నుంచి తొలగించినట్టు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదని, ఆరోపణల కారణంగా తనను యూనియన్ నుంచి తొలగించారని ప్రచారం చేస్తున్నారన్నారు. యూనియన్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ఇంకా ఉందని, కానీ తనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించారని జానీ మాస్టర్ ఆరోపించారు. అనధికారికంగా నిర్వహించిన ఎన్నికలు చెల్లవని, యూనియన్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు.

Next Story