లైంగిక వేధింపుల కేసు.. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బెయిల్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేశారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పోక్సో ‌కేసు నమోదు చేశారు.

By అంజి  Published on  24 Oct 2024 12:55 PM IST
Choreographer Jani Master, bail, harassment case, Crime, Hyderabad

లైంగిక వేధింపుల కేసు.. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బెయిల్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేశారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 14 రోజులుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. పోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్టు అవార్డు కమిటీ ప్రకటించారు. ఆ అవార్డు ఫంక్షన్‌ కోసం జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ పొందారు. అయితే తాజాగా మరోసారి బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయ్యింది.

జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడని, 2019లో అతని బృందంలో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరాను. ముంబైలో ఓ సినిమా షూటింట్‌ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు తాను, మరో ఇద్దరు అసిస్టెంట్లు కలిసి వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరింపులకు గురి చేశాడు. దీన్ని ఛాన్స్‌గా తీసుకుని.. ఇతర నగరాలకు షూటింగ్‌కు వెళ్లిన ప్రతి సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్‌ బృందం నుంచి బయటకొచ్చేశాను'' అంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story