అరుదైన ఫోటోలో 'బ్రదర్స్ డే శుభాకాంక్షలు' చెప్పిన మెగా స్టార్
Chiru Shares Childhood Memories. అంతర్జాతీయ బ్రదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఓ అరుదైన ఫోటోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.
By Medi Samrat Published on 24 May 2021 9:55 AM GMT
మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే..! ఏదైనా అకేషన్ ఉంది అంటే చాలు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. అంతర్జాతీయ బ్రదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఓ అరుదైన ఫోటోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో తన చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటోలో చిన్నవాడైన పవన్ కల్యాణ్ ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఈ ఫొటోను పోస్టు చేసిన చిరంజీవి.... తోడబుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ (ఫ్యాన్స్)కి హ్యాపీ బ్రదర్స్ డే అంటూ విషెస్ తెలిపారు.
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P
సినిమాల పరంగా చిరంజీవి పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే..! లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికి ఆచార్య సినిమా కూడా విడుదలై ఉండేది. చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే జోడీగా కనిపించనున్నారు. ఈ సినిమాలో 'సిద్ధా' అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.
మరో వైపు కరోనా కష్ట కాలంలో ఎంతో మంది నిస్సహాయులకు చిరంజీవి సహాయం చేస్తూనే ఉన్నారు. సీనియర్ సినీ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్ కు కూడా చిరు ఆర్థికసాయం అందించారు. భరత్ భూషణ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో సాయం అర్థించారు. వెంటనే స్పందించిన చిరంజీవి తన ప్రతినిధుల ద్వారా భరత్ భూషణ్ కు రూ.50 వేల చెక్ అందించారు. చెక్ అందుకున్న భరత్ భూషణ్ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు.