తారక్ తో మాట్లాడి.. నందమూరి అభిమానుల టెన్షన్ తగ్గించిన మెగా స్టార్

Chiru Gives Update About NTR Health.తారక్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి ఓ అప్డేట్ ను ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే తారక్ తో మాట్లాడానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

By Medi Samrat  Published on  12 May 2021 8:39 AM GMT
Chiranjeevi gives update of NTR

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇటీవలే తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అయితే ఎవరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పారు. ప్రస్తుతానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. నేను, నా కుటుంబం ఐసోలేషన్ లో ఉన్నామని.. వైద్యులు చెప్పిన అన్ని సలహాలను పాటిస్తూ ఉన్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా వచ్చిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. తారక్ కు కరోనా అని తెలియగానే అభిమానుల్లో కాస్త టెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు.

ఇక తారక్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి ఓ అప్డేట్ ను ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే తారక్ తో మాట్లాడానని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడానని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉన్నారని చిరంజీవి తెలిపారు. తారక్ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని చిరు చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా, ఎంతో ఎనర్జీగా ఉన్నారని తెలుసుకుని చాలా ఆనందించానని చెప్పుకొచ్చారు చిరంజీవి. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నానని.. దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లుగా చిరంజీవి ట్వీట్ చేశారు.

" కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. God bless @tarak9999" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త చెప్పినందుకు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఇక కరోనా బారిన పడ్డ మెగా హీరో అల్లు అర్జున్ కు కూడా నేడు నెగటివ్ వచ్చింది.


Next Story