ఏకంగా చిరంజీవితో స్టేజీ మీద డ్యాన్స్ చేయించిన సాయి పల్లవి

Chiranjeevi's Dance Challenge With Sai Pallavi. సాయి పల్లవి, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'లవ్ స్టోరీ'. ఆదివారం సాయంత్రం

By Medi Samrat  Published on  20 Sept 2021 2:55 PM IST
ఏకంగా చిరంజీవితో స్టేజీ మీద డ్యాన్స్ చేయించిన సాయి పల్లవి

సాయి పల్లవి, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'లవ్ స్టోరీ'. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్రయూనిట్. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హాజరయ్యారు. ఈ ఫంక్షన్ లో సాయి పల్లవి మెగా స్టార్ చిరంజీవితో స్టేజీ మీద స్టెప్పులు వేయించింది.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. తన సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని నవ్వుతూ అన్నారు. సాయి పల్లవి డ్యాన్స్‌ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్‌ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు అంటూ నవ్వించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు.

ఇదిలా ఉండగా.. తనకు రీమేక్‌ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. చిన్నప్పటి నుండి మీ స్టెప్స్ చూస్తూ ఎదిగానని ఆమె తెలిపింది. ఇక స్టేజ్‌పై చిరుతో సాయిపల్లవి తనకు డ్యాన్స్ చేయాలని ఉందని తెలిపింది. నా పాట కాకుండా మీ పాట పెట్టినా చేస్తానని తెలిపింది. వెంటనే నిర్వాహకులు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటను పెట్టారు. కొద్దిసేపు డ్యాన్స్ చేయకుండా సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. సాయి పల్లవి బలవంతం పెట్టడంతో డ్యాన్స్ చేసేశారు. ఆయన వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి.



Next Story