భార్య‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్లిన మెగాస్టార్‌

Chiranjeevi to enjoy USA and Europe vacation with his wife Surekha.మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 8:15 AM GMT
భార్య‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్లిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టించిన చిత్రం 'ఆచార్య‌'. ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విరామం లేకుండా న‌టిస్తున్న చిరు ప్ర‌స్తుతం షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత తొలిసారి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. త‌న భార్య సురేఖ‌తో క‌లిసి అమెరికా, యూర‌ప్ ల‌కు వెలుతున్నారు. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు.

'కరోనా పాండమిక్‌ తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా' అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు మెగాస్టార్‌. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 'హ్యాపీ జ‌ర్నీ' అంటూ కామెంట్లు చేశారు.

ఇక చిరు న‌టిస్తున్న సినిమాల విషయానికొస్తే.. మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'భోళాశంకర్', మోహన్ రాజా డైరెక్ష‌న్‌లో 'గాడ్ ఫాదర్' , బాబి దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రాల్లో మెగాస్టార్‌ నటిస్తున్నారు.

Next Story
Share it