ఆ గెటప్‌లో చిరంజీవిని చూసి షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌..!

Chiranjeevi stunning halloween look. హాలోవీన్ ఉత్సవాల నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి దెయ్యం గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపోయేలా చేశారు. ఆ లుక్‌లో

By అంజి  Published on  1 Nov 2021 8:39 AM GMT
ఆ గెటప్‌లో చిరంజీవిని చూసి షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌..!

హాలోవీన్ ఉత్సవాల నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి దెయ్యం గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపోయేలా చేశారు. ఆ లుక్‌లో చిరంజీవి కనిపించి అభిమానులకు పెద్ద షాక్‌ ఇచ్చారు. చిరంజీవి హాలోవీన్‌ గెటప్‌లో ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోల హాలోవీన్‌ గెటప్‌లో చిరంజీవి పాట పాడుతూ కనిపించారు. టాలీవుడ్ అగ్ర చిరంజీవి యంగ్‌ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. కొత్త లుక్స్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు కేక పెట్టిస్తున్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో కూడా చిరంజీవి గుండు ఫొటోతో కనిపించి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. అక్టోబర్‌ 31 ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్‌ ఉత్సవాలు జరిగాయి. వివిధ గెటప్‌లు వేసి, భయంకరమైన డ్రెస్సులు వేసుకొని అందరూ పార్టీల్లో మునిగి తేలారు. నాగబాబు కుమార్తె నిహారిక తన భర్తతో కలిసి హాలోవీన్‌ వేడుకను జరుపుకున్నారు. డిఫరెంట్‌ గెటప్‌లో భర్తతో కలిసి నిహారిక సందడి చేసింది.

కొరటాల శివ డైరెక్షన్‌లో చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఫిబ్రవరి 4, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే లూసిఫర్‌ రీమేక్‌గా వస్తోన్న 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. దీంతో పాటు మెహర్‌ రమేశ్‌ డైరెక్సన్‌లో 'భోళా శంకర్‌' సినిమా షూటింత్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Next Story
Share it