చిరంజీవి-త్రివిక్రమ్.. సెట్ అవ్వబోతోందా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో జయాపజయాలు కొత్తేమీ కాదు. కానీ ఆయన నటించిన భోళా శంకర్ సినిమా మాత్రం

By Medi Samrat  Published on  2 Oct 2023 9:45 PM IST
చిరంజీవి-త్రివిక్రమ్.. సెట్ అవ్వబోతోందా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో జయాపజయాలు కొత్తేమీ కాదు. కానీ ఆయన నటించిన భోళా శంకర్ సినిమా మాత్రం ఊహించని పరాజయం పాలైంది. చిరంజీవి లాంటి లెజెండ్ చేయాల్సిన సినిమా కానే కాదని ఎంతో మంది వాపోయారు. సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుండి నెగటివ్ వైబ్ అనేది వెంటాడుతూ వచ్చింది. ఆఖరి డిజాస్టర్ ను మూటగట్టుకుంది ఆ సినిమా. ఈ సినిమా పరాజయం తర్వాత చిరంజీవి కూడా మంచి కథలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా రీమేక్ జోలికి వెళ్లడం లేదాయన. అలాగే కళ్యాణ్ కృష్ణతో చేయబోయే ప్రాజెక్ట్‌ని రద్దు చేసుకున్నారు. సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాకుండా ఒక మంచి చిత్రంతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యాడు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిస్ట్‌తో ఆయన సినిమా చేయబోతూ ఉన్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఓ ఫాంటసీ సినిమాలో కనిపించనున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత, చిరంజీవి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని ఫిలింనగర్ సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్‌ ఒకరు. చిరంజీవి-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మెగా అభిమానులకే కాదు.. సినీ అభిమానులందరికీ గుడ్ న్యూస్. ఈ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ 'పుష్ప 2' తర్వాత అట్లీతో సినిమా చేయాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే, త్రివిక్రమ్‌కు మరో చిత్రానికి తగినంత సమయం ఉంటుంది. ఆ సమయంలో చిరంజీవితో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.

Next Story