మెగాస్టార్ చిరంజీవికి దక్కిన మరో అరుదైన గౌరవం

ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 10 సంవత్సరాల గోల్డెన్ వీసాతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది

By Medi Samrat  Published on  29 May 2024 3:49 PM IST
మెగాస్టార్ చిరంజీవికి దక్కిన మరో అరుదైన గౌరవం

ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 10 సంవత్సరాల గోల్డెన్ వీసాతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది. మెగాస్టార్‌ చిరంజీవికి యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ వీసాను అందజేసింది. UAE గోల్డెన్ వీసా పొందిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో చిరంజీవి చేరారు.

గోల్డెన్ వీసాను 2019లో UAE ప్రభుత్వం రూపొందించింది. జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా UAE ప్రధాన భూభాగంలో వారి వ్యాపారంపై 100 శాతం యాజమాన్య హక్కులు ఇస్తారు. అంతేకాకుండా విదేశీయులు దేశంలో నివసించడానికి, పని చేయడానికి, చదువుకోవడానికి అనుమతిస్తుంది. ఈ వీసాలు 5 లేదా 10 సంవత్సరాలకు జారీ చేస్తారు. ఈ వీసాను అందుకున్న సెలెబ్రిటీల జాబితాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వరుణ్ ధావన్, రణవీర్ సింగ్, మోహన్ లాల్, మమ్ముట్టి, సునీల్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనూ సూద్, రజనీకాంత్ తదితరులు ఉన్నారు.

Next Story