తెలుగు సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన సోదరి మాదాసు సత్యవతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఆమె మరణంపై విచారం వ్యక్తం చేశారు. ‘‘తమ్ముడు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్‌కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని చిరంజీవి పోస్టు పెట్టారు.