ఓటీటీలో ఛావా.. దక్షిణాది అభిమానులకు షాక్..!

విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ఈ సంవత్సరం భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

By Medi Samrat
Published on : 11 April 2025 9:21 PM IST

ఓటీటీలో ఛావా.. దక్షిణాది అభిమానులకు షాక్..!

విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ఈ సంవత్సరం భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం OTT విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. చావా OTT లో విడుదల అయినప్పటికీ.. దక్షిణాది అభిమానులను నిరాశపరిచింది.

హిందీలో విడుదల చేసినప్పుడే దక్షిణాది భాషలలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని నిర్మాతలు విడుదల చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో, చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హిందీలోనే చూశారు. ప్రజల డిమాండ్‌ కారణంగా గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. విడుదల ఆలస్యం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సినిమా విడుదలైనా కూడా తెలుగు, దక్షిణాది ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో మాత్రమే ప్రసారం అవుతోంది. దక్షిణాది ప్రేక్షకులు ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Next Story