నితిన్ చెక్ టీజ‌ర్ అదిరిపోయిందిగా.. అస‌లే ఆ ద‌ర్శ‌కుడు..

Check Telugu Movie First Glimpse. నితిన్ తాజా చిత్రం చెక్ సినిమా టీజ‌ర్ జైలు శిక్ష అనుబివిస్తున ఖైదీగా రిలీజ్ అయింది.

By Medi Samrat  Published on  3 Jan 2021 11:31 AM IST
Check Telugu Movie

కొత్త పెళ్లికొడుకు నితిన్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా చెక్. భ‌వ్య క్రియేష‌న్స్‌పై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ చంద్రశేఖర్ యేలేటి‌ దర్శకత్వం వహిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో వ‌స్తున్న ఈ చిత్రానికి 'చెక్‌' అని టైటిల్‌ పెట్టారు. టైటిట్‌తో అంద‌రిని ఆక‌ర్శించిన ఈ సినిమా నుండి ఓ అప్‌డేట్ వ‌చ్చింది.

తాజాగా చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నితిన్ ఖైదీగా క‌నిపిస్తూ అల‌రిస్తున్నాడు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ జీవిత నేప‌థ్యంలో చెక్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా.. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది. నితిన్ ఇటీవ‌ల 'రంగ్ దే' చిత్ర షూటింగ్ పూర్తి చేసి మార్చి 26న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. వెంకి అట్లూరి ద‌ర్శ‌కుడు.


Next Story