బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా జంటపై ఫిర్యాదు చేసిన యువకుడు

Cheating complaint against Shilpa Shetty, Raj Kundra at Bandra police station. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా జంటపై తాజాగా మరో కేసు నమోదైంది.

By Medi Samrat  Published on  14 Nov 2021 5:29 PM IST
బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా జంటపై ఫిర్యాదు చేసిన యువకుడు

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా జంటపై తాజాగా మరో కేసు నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదైంది. పుణేకు చెందిన నితిన్‌ బరాయ్‌ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు 420 (మోసం), 120-బీ (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు)తో పలు కేసుల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాను పోలీసులు విచారించే అవకాశం ఉన్నది. నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా మరియు SFL ఫిట్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్‌లు తనను ₹1.51 కోట్లు మోసం చేశారంటూ పూణే వ్యక్తి ఫిర్యాదుపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాంద్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాషిఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా మరియు ఇతరులతో కలిసి ఇంద్రప్రస్త్, హడ్‌పసర్‌లోని తన ప్లాట్‌లో తెరవాలనుకుంటున్న ఫిట్‌నెస్ ఫ్రాంచైజీలో డబ్బు పెట్టుబడి పెట్టమని అడిగారని యష్ నితిన్ బరాయ్ (25) ఫిర్యాదు చేశాడు. రాజ్‌కుంద్రా పలువురుతో కలిసి తమ కంపెనీ ఫ్రాంచైజీని తీసుకొని కోరెగావ్‌ ప్రాంతంలో స్పా, జిమ్‌ను తెరిస్తే లాభాలు వస్తాయని ఆశ చూపించారని సదరు వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు రూ.1.59కోట్ల పెట్టుబడి పెట్టానని.. తన డబ్బును కాసిఫ్‌ఖాన్‌, శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారని, లాభాలు రాకపోవడంతో తన డబ్బును ఇవ్వమని అడిగితే బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు.

యష్ అప్పుడు మైనర్ కావడంతో, అతని తండ్రి 2014లో ఖాన్‌కు మూడు నెలల వ్యవధిలో ₹1.51 కోట్లు ఇచ్చాడు. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని, తన డబ్బు అడిగినప్పుడు తనను బెదిరించారని యష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. "మేము బరై ఫిర్యాదుపై కేసు నమోదు చేసాము. అతని పూర్తి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసాము. కేసును దర్యాప్తు చేస్తున్నాము మరియు అన్ని పత్రాలు మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ధృవీకరిస్తున్నాము" అని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.


Next Story