కోలీవుడ్‌లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం కంగువ. ఈ సినిమా ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందనను పొందింది. ఇది ప్రేక్షకులకు, నిర్మాతలకు కూడా పెద్ద షాకిచ్చింది. ప్రేక్షకులు సినిమా కంటెంట్ గురించి కూడా ప్రశ్నించారు. దీంతో రెండో రోజు నుంచి థియేటర్లలో కంగువ ఎడిట్ వెర్షన్ తీసుకుని రావడానికి మేకర్స్ ప్రయత్నించారు.
కంగువను చూసిన వ్యక్తులు సినిమాలోని చాలా పాత్రలు బిగ్గరగా అరుస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన BGM కూడా ఎక్కువగా అనిపించింది. ఈ సమస్యను వెంటనే గ్రహించి సౌండ్ మిక్సింగ్‌ని మార్చారు. క్లైమాక్స్ ఫైట్ సమయంలో కొన్ని పోర్షన్స్ కూడా ఈ మారిన వెర్షన్‌కి కొత్తగా యాడ్ చేశారు. ఈ మార్పులు మేకర్స్ ఆశించిన విధంగా థియేటర్లను ప్రేక్షకులను రప్పించలేదు.
కంగువ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 40 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే 2వ రోజు కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. దీపావళి సందర్భంగా విడుదలైన అమరన్, లక్కీ బాస్కర్ ఇప్పటికీ బలంగా నడుస్తున్నాయి. ఇక మొదటి రోజు వచ్చిన నెగిటివ్ మౌత్ టాక్ కంగువపై ప్రభావం చూపించింది.