రవితేజ 'ఈగల్' సినిమా సెన్సార్ రిపోర్టు వచ్చేసింది

సంక్రాంతి రిలీజ్ నుండి వాయిదా పడిన సినిమాల్లో రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా ఒకటి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By Medi Samrat  Published on  7 Feb 2024 9:30 PM IST
రవితేజ ఈగల్ సినిమా సెన్సార్ రిపోర్టు వచ్చేసింది

సంక్రాంతి రిలీజ్ నుండి వాయిదా పడిన సినిమాల్లో రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా ఒకటి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ రన్ టైమ్ 158 నిమిషాల 37 సెకన్లు ఉందని తెలుస్తోంది. రెండున్నర గంటల కంటే కొంచెం ఎక్కువ రన్ టైమ్ ఉండడం పర్వాలేదు. ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేట్రికల్ బిజినెస్ విలువ సుమారుగా 23 కోట్ల రూపాయలు ఉంది.

రవితేజ ఇటీవలే ఈ సినిమా ఫైనల్ కట్‌ని చూసారు. అవుట్‌పుట్‌తో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి నుంచి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు రవితేజ. ఇంతకుముందు నిఖిల్‌తో సూర్య వర్సెస్ సూర్య చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈగిల్ ఈ వారం యాత్ర 2, రజనీకాంత్ లాల్ సలామ్‌ సినిమాలతో పోటీపడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈగల్‌ను టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధు, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ కీలక పాత్రలు పోషించారు.

Next Story