చిక్కుల్లో ఆలియా భట్.. కేసు నమోదు
case files against Alia Bhatt, Sanjay Leela Bhansali. ఆలియా భట్ నటిగా ఎదుగుతూ ఉంది.. ప్రస్తుతం ఆమె గంగూబాయ్ కతియావాడి
By Medi Samrat Published on 27 Dec 2020 6:38 PM ISTఆలియా భట్ నటిగా ఎదుగుతూ ఉంది.. ప్రస్తుతం ఆమె గంగూబాయ్ కతియావాడి సినిమాలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం పలు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. ఈ నేపథ్యంలో కథపై అభ్యంతరం తెలుపుతూ గంగూబాయ్ కతియావాడి కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టును ఆశ్రయించారు.
ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంజయ్ లీలా భన్సాలీతో పాటు, టైటిల్ రోల్ పోషిస్తున్న అలియా భట్ మీద కేసు నమోదైంది. 'ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీ, సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పైన బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం తమ ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను దెబ్బ తీయడంతో పాటు పరువుకు భంగం కలిగిస్తోందని బాబూజీ రాజీ షా అన్నారు.
ఈ సినిమా ప్రోమో రిలీజైనప్పటి నుంచి బాబూజీ రాజీ షా, అతడి కుటుంబం గురించి వ్యతిరేక ప్రచారం జరుగుతోందని.. బాబూజీ రాజీ షా వేధింపులకు గురవుతున్నాడని అతడి తరపు లాయర్ తెలిపారు. వేశ్య కుటుంబం అంటూ షా, అతడి బంధువులను ఎగతాళి చేస్తున్నారని అన్నారు. సినిమాలో మహిళను అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని అన్నారు.