టాలీవుడ్‌ అగ్ర నిర్మాత‌పై చీటింగ్ కేసు

Case Filed Against Producer Anand Prasad.టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నిర్మాత‌, భవ్యాస్ అధినేత‌ ఆనంద్‌ ప్రసాద్ పై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ‌

By Medi Samrat
Published on : 28 March 2021 10:39 AM IST

Case Filed Against Producer Anand Prasad

శేరిలింగంప‌ల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నిర్మాత‌, భవ్యాస్ అధినేత‌ ఆనంద్‌ ప్రసాద్ పై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవ్య‌ కన్‌‌స్ట్ర‌క్షన్స్ అధినేత సినీ నిర్మాత వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ తనను మోసం చేశాడంటూ కంప్లైంట్ చేయ‌డం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు.

ఆనంద్ ప్రసాద్ 2017లో త‌న‌ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ.. దానికిగాను నాలుగు శాతం లాభాలు ప్రతి సంవత్సరం తిరిగి ఇస్తామని చెప్పి తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నార‌ని.. ముందుగా చెప్పిన మేరకు అసలు ప్రతిఫలం ఇవ్వకుండా దాట వేస్తున్నారని, తిరిగి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు పేర్కొన్నాడు.

ఎన్నికల్లో పోటీ చేసి ఒడిపోయినందున తనకు కొంత సమయం ఇవ్వాలని.. తనకు బాచుపల్లి బరంపేట ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు మీపేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి కొన్నాళ్ళు గడిపారని.. ఎన్నిసార్లు అడిగినా అప్పటికీ సరైన సమాధానం ఇవ్వకపోగా.. చంపుతామని బెదిరించడంతో తానును ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఆనంద ప్రసాద్ కుమారుడు, కోడలిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే వారిద్ద‌రి అదుపులోకి తీసుకోగా.. ఆనంద్‌ప్రసాద్ కోసం గాలిస్తున్నారు.


Next Story