బాలయ్య నిర్మాతకు నాన్ బెయిల్ వారెంట్!

Case Filed Against Miryala Ravinder Reddy. తెలుగు ఇండస్ట్రీలో ‘సింహా’,‘లెజెండ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేటర్ చేశారు

By Medi Samrat  Published on  13 March 2021 5:47 AM GMT
బాలయ్య నిర్మాతకు నాన్ బెయిల్ వారెంట్!

తెలుగు ఇండస్ట్రీలో 'సింహా','లెజెండ్' చిత్రాలతో సెన్సేషన్ క్రియేటర్ చేశారు బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్. చాలా కాలం తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. గత కొంత కాలంగా బాలయ్య, బోయపాటికి సక్సెస్ లు లేవు. దాంతో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ యాక్షన్, సెంటిమెంట్ చిత్రం రాబోతుంది. అయితే చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. తాజాగా రవీందర్ రెడ్డి మీద ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) ఇష్యూ చేసింది. రవీందర్ రెడ్డి మీద ఓ డిస్ట్రిబ్యూటర్ చీటింగ్ కేసు పెట్టారు.

రవీందర్ రెడ్డి గతంలో నాగ చైతన్య హీరోగా రూపొందిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను నిర్మించారు. సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ విషయంలోనే కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. అమెరికాలో సెటిలైన ఒక డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి సినిమాను ఇస్తానంటూ 50 లక్షలు తీసుకున్నారట రవీందర్ రెడ్డి. అయితే ఆ అగ్రిమెంట్ ని లెక్క చేయకుండా వేరే వారికి రైట్స్ అమ్మేసారట‌. డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకున్న మొత్తం వెనక్కి ఇవ్వకుండా పది లక్షలు మాత్రమే ఇస్తానంటున్నారట.

దీంతో సదరు డిస్ట్రిబ్యూటర్ కేసు వేయడంతో ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. కోర్టు రవీందర్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని పలుసార్లు ఆదేశించింది. కానీ ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి వివాదం నుండి రవీందర్ రెడ్డి ఎలా భయటపడతారో చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు.


Next Story
Share it