టాలీవుడ్ యంగ్ హీరో మీద చీటింగ్ కేసు..!
Case Filed Against Kerintha Hero. టాలీవుడ్ యువ నటుడు, కేరింత సినిమా ద్వారా విశ్వంత్ దుద్దుంపూడిపై చీటింగ్ కేసు.
By Medi Samrat Published on 20 Jan 2021 3:39 PM ISTటాలీవుడ్ యువ నటుడు, కేరింత సినిమా ద్వారా విశ్వంత్ దుద్దుంపూడిపై చీటింగ్ కేసు నమోదైనట్లు సమచారం. తక్కువ ధరకే కార్లు ఇప్పిస్తానని కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితలంతా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వంత్ తమను నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసుల ఎదుట వాపోయినట్లు కథనాలు వచ్చాయి.
దిల్ రాజు నిర్మించిన 'కేరింత' మూవీలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మోహన్‌లాల్, గౌతమిలు నటించిన 'మనమంతా'లో నటించాడు. 'ఓ పిట్టకథ' మూవీతో పాలు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. కాగా కాకినాడ సామర్లకోటకు చెందిన అతడు పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్‌లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్‌లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్‌కు 2015లో 'కేరింత'లో నటించే అవకాశం వచ్చింది. అలాంటిది ఒక్కసారిగా అతడి మీద చీటింగ్ కేసు రావడంతో టాలీవుడ్ కాస్తా షాక్ అయ్యింది. అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్టు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.