పబ్‌లో గొడవ.. టాలీవుడ్ న‌టికి షాకిచ్చిన గచ్చిబౌలి పోలీసులు

టాలీవుడ్ నటి కల్పికకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు

By Knakam Karthik
Published on : 12 Jun 2025 12:14 PM IST

Cinema News, Tollywood, Actor Kalpika, Hyderabad, Prism Pub, Gachibowli Police Station

పబ్‌లో గొడవపై నటి కల్పికకు షాకిచ్చిన గచ్చిబౌలి పోలీసులు

టాలీవుడ్ నటి కల్పికకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రిజమ్ క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఫిర్యాదు మేరకు 324(4), 352, 351(2) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 29న క్లబ్‌​కు వెళ్లిన కల్పిక రూ.2,200 బిల్​ చేశారు. అందుకు కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో బిల్​ కట్టకుండా హంగామా చేశారని పబ్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు మేనేజర్, ఇతర సిబ్బంది అసభ్య ప్రవర్తనంటూ సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, అలాగే క్లబ్‌​లోని సామగ్రి ధ్వంసం, పోలీసుల వద్ద కూడా అసత్య ప్రచారాలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పబ్‌లో గొడవకు సంబంధించి కల్పిక ఇటీవలో ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేక్‌ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్రగ్‌ ఎడిక్ట్‌ అంటూ దూషించారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, అది ముదరడంతో పబ్‌ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

Next Story