ఓటీటీలోకి వచ్చేస్తున్న కెప్టెన్ మిల్లర్.. తెలుగులో ఎప్పుడంటే?

ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ గత నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. సానుకూల సమీక్షలు, మంచి టాక్ వచ్చింది.

By Medi Samrat  Published on  2 Feb 2024 9:00 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న కెప్టెన్ మిల్లర్.. తెలుగులో ఎప్పుడంటే?

ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ గత నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. సానుకూల సమీక్షలు, మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పొంగల్ రేసులో శివకార్తికేయన్ అయాలాన్‌తో పోటీ పడింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్‌కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు.

1930వ దశకంలో, బ్రిటీష్ పాలన సమయంలో ఒక మాజీ బ్రిటిష్ ఆర్మీ సైనికుడు తన సొంత గ్రామాన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమాలో చూడొచ్చు. ఇప్పుడు, పీరియాడికల్ యాక్షన్ డ్రామా OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ప్రైమ్ వీడియో ఈ రోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. కెప్టెన్ మిల్లర్ తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ అయింది. సినిమా తెలుగు వెర్షన్‌ను 11 నిమిషాలకు తగ్గించారు.. రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్‌తో ఓపెనింగ్ రోజున, ఇది 1 కోటికి పైగా గ్రాస్ కలెక్షన్‌స్ సాధించింది. అయితే ఆ తర్వాతి రోజు నుండి ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఎలాగూ తెలుగు ప్రేక్షకులను మెప్పించని ఈ సినిమా.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Next Story