ఆ రెండు సినిమాలు తెలుగులో విడుదల అవ్వడం లేదు
కెప్టెన్ మిల్లర్, అయాలాన్ సినిమాలు తెలుగులో సంక్రాంతికి విడుదల కావడం లేదు.
By Medi Samrat Published on 31 Dec 2023 9:00 PM ISTకెప్టెన్ మిల్లర్, అయాలాన్ సినిమాలు తెలుగులో సంక్రాంతికి విడుదల కావడం లేదు. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ జనవరి 12న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయాలాన్ సినిమా కూడా పొంగల్ సందర్భంగా విడుదల అవుతూ ఉంది. ఈ రెండు సినిమాలూ భారీ బడ్జెట్ తో, ఆయా హీరోల కెరీర్ లోనే రికార్డు బడ్జెట్ తో రూపొందుతున్నాయి. రెండు సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ప్లాన్ చేశాయి. కానీ సంక్రాంతికి చాలా తెలుగు సినిమాలు రిలీజ్ ఉండడంతో కెప్టెన్ మిల్లర్, అయాలాన్ తెలుగులో రిలీజ్ కు ఇతర తేదీలకు షిఫ్ట్ అయ్యాయి. తమిళ వెర్షన్లు మాత్రమే జనవరి 12 న విడుదలవుతాయని సమాచారం. రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన 'లాల్ సలామ్' కూడా అదే సమస్య కారణంగా వాయిదా పడింది.
మహేష్ బాబు గుంటూరు కారం, సూపర్ హీరో మూవీ హనుమాన్, వెంకటేష్ సైంధవ్, రవితేజ డేగ, నాగార్జున నా సామి రంగ వంటి అనేక తెలుగు సినిమాలు సంక్రాంతి సెలవులకు థియేటర్లలో సందడి చేయాలని ఫిక్స్ అవ్వగా.. ఇప్పుడు రెండు తమిళ చిత్రాలను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యాయి. దీంతో కెప్టెన్ మిల్లర్, అయాలాన్ తెలుగులో సంక్రాంతికి విడుదల కావడం లేదు.