బాయ్స్ హాస్టల్ సినిమా.. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం
కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
By Medi Samrat Published on 29 Aug 2023 8:30 PM ISTకన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కామెడీ, భావోద్వేగాల కలయికతో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. నూతన దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కొత్త తారాగణంతో కలిసి తీసిన సినిమా కన్నడలో మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో ఆగస్టు 26న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి కలెక్షన్స్ దక్కించుకోగా.. మేకర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కొనండి, ఒక టికెట్ పొందండి అనే ఆఫర్‌తో ముందుకు వచ్చారు.
యూత్ ఫుల్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమా కలెక్షన్లను మరింత పెంచడానికి.. ప్రేక్షకులను ఆకర్షించడానికి టీమ్ కొత్త ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. రేపటి నుండి అన్ని ప్రధాన నగరాల్లో, సినిమా టికెట్ ఒకటి కొంటే.. మరొక టికెట్ ఉచితంగా లభించనుందని ఆఫర్ ఇచ్చారు. దీంతో కాలేజీ స్టూడెంట్స్ సినిమాకు క్యూ కట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు.