బస్సు ప్రమాదం.. 'పుష్ప-2' ఆర్టిస్టులకు తీవ్రగాయాలు

అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప-2'. ఈ సినిమాను సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఆర్టిస్టులు వెళ్తున్న బస్సు రోడ్డు

By అంజి  Published on  31 May 2023 10:00 AM IST
Pushpa 2, Bus Accident, Tollywood, Pushpa 2 artistes

బస్సు ప్రమాదం.. 'పుష్ప-2' ఆర్టిస్టులకు తీవ్రగాయాలు

అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప-2'. ఈ సినిమాను సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఆర్టిస్టులు వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తే రహదారిలో నార్కట్‌పల్లి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ కంప్లీట్‌ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. రెండేళ్ల కిందట విడుదలైన 'పుష్ప' సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రెండు షూటింగ్‌ షెడ్యూల్స్‌ పూర్తి కాగా.. ఇప్పుడు మూడో షెడ్యూల్‌ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.

Next Story