టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన సోదరుడు అల్లు శిరీష్, నయనికా రెడ్డి దంపతులను ఆశీర్వదించేందుకు చంద్రబాబు వ్యక్తిగతంగా తమ నివాసానికి రావడం పట్ల అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమ ఇంటికి వచ్చిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని, అందుకే ఆయన్ను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయానని అల్లు అర్జున్ తెలిపారు. ఫోన్‌లో ఆయనతో మాట్లాడటం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. నూతన జంట శిరీష్, నయనికలకు చంద్రబాబు అందించిన ఆశీస్సులు, చూపిన ఆత్మీయతకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.