ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన కామెడీ డ్రామా 'బ్రహ్మా ఆనందం'.

By Medi Samrat  Published on  13 March 2025 9:30 PM IST
ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన కామెడీ డ్రామా 'బ్రహ్మా ఆనందం'.ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి మార్కులు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు.

మార్చి 14, 2025 నుండి ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ రన్‌ దాదాపుగా పూర్తవ్వడంతో OTTలో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు RVS నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శాండిల్య పిసపతి సంగీతం అందించగా, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, తాళ్లూరి రామేశ్వరి నటించారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెన్త్ రోల్ లో నటించారు.

Next Story