హీరో విజయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో అపశ్రుతి

నటుడు విజయ్ శనివారం తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  22 Jun 2024 8:59 PM IST
హీరో విజయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో అపశ్రుతి

నటుడు విజయ్ శనివారం తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. చెన్నైలోని నీలంకరై ప్రాంతంలో కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా పిల్లలతో ప్రమాదకర, సాహసోపేతమైన కార్యకలాపాలు నిర్వహించారు. చేతులపై పెట్రోల్ పోసుకోవడం, రాళ్లను పగలగొట్టడం వంటివి ఉన్నాయి. అటువంటి ప్రదర్శనలో ఒక బాలుడు గాయాలపాలయ్యాడు.. మంటలు అంటుకున్న పలకను తన చేత్తో పగులగొట్టే క్రమంలో పిల్లాడి చేతికి మంటలు అంటుకున్నాయి. వేగంగా వ్యాపిస్తున్న మంటలను వదిలించుకోవడానికి బాలుడు కేకలు వేశాడు. ప్రదర్శన దగ్గర వద్ద ఉన్న పెట్రోల్ క్యాన్‌కు నిప్పు అంటుకుంది. స్టేజ్‌ మీద ఉన్న కొన్ని భాగాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. కొందరు బాలుడిని రక్షించి, చికిత్స కోసం నీలంకరైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు.

Next Story